రస్ అల్ ఖైమా కు విమానాల్ని ప్రారంభించనున్న స్పైస్‌జెట్
- November 21, 2020
యూఏఈ: నవంబర్ 26న తొలి కమర్షియల్ విమానం ఇండియా నుంచి (కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత) రస్ అల్ ఖైమా విమానాశ్రయంలో దిగనుందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. వారానికి రెండు సార్లు స్పైస్‌జెట్ విమానాలు ఇండియా - రస్ అల్ ఖైమా మధ్య తిరగనున్నాయి. ఇండియాలోని ఢిల్లీలోగల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పైస్‌జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. 189 మంది ప్రయాణీకు సామర్థ్యంతో బోయింగ్ 737-800 విమానాలు ఈ సర్వీసుల్ని అందిస్తాయి. గురువారం అలాగే శనివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరతాయి. శుక్రవారం ఉదయం అలాగే సోమవారం ఉదయం ఈ విమానాలు రస్ అల్ ఖైమా చేరుకుంటాయి. సోమవారం అలాగే శుక్రవారం ఈ విమానాలు ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అవుతాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ