బ్రెయిన్ డెడ్ తో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబసభ్యులను పరామర్శించిన సీపీ సజ్జనార్
- November 21, 2020
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీలో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా కోనేరి ఆంజనేయులు పని చేస్తున్నాడు. 2018 బ్యాచ్ కి చెందిన కోనేరి ఆంజనేయులు వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్ గ్రామానికికి చెందిన వారు.
కాగా ఈనెల 18వ తేదీన విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనం పై వెళ్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద మన్నెగూడెం వైపు వేగంగా వెళ్తున్న బోలెరో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అతని తలకు, శరీరానికి బలమైన గాయాలయ్యి అపస్మారక స్థితికి చెరుకున్నాడు. ఇది గమనించిన చుట్టుపక్కన వారు చికిత్స నిమిత్తం పీసీ ఆంజనేయులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రి కి తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా ఈరోజు., 21 వ తేదీన వేకువజామున ఉదయం 2 గంటల ప్రాంతంలో పీసీ ఆంజనేయులు అని బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు నిర్ధారించారు.
ఆంజనేయులు కుటుంబసభ్యులను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, కానిస్టేబుల్ పరామర్శించారు. అవయవదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవల్సిందిగా ఆంజనేయులు కుటుంబసభ్యులకు సీపీ కోరారు.కానిస్టేబుల్ కొనేరి ఆంజనేయులు యొక్క గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్/ కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను అతని కుటుంబసభ్యులు సైబరాబాద్ పోలీసుల ఆర్గన్ డొనేషన్ ఇనీషియేటివ్ ‘మరోజన్మ’ సహకారంతో ప్రభుత్వరంగ సంస్థ ‘జీవన్ దాన్’ కు అప్పగించారు.
తమ కుటుంబ సభ్యుడు ఇక లేరనే బాధలో ఉన్నప్పటికీ మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకి వచ్చిన కుటుంబ సభ్యులను సీపీ అభినందించారు.
ఆంజనేయులు భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన వికారాబాద్ జిల్లా, పరిగి మండలం, బాబాపూర్ కు తరలించారు. బాబాపూర్ లో కానిస్టేబుల్ కొనేరి ఆంజనేయులు పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్. సైబరాబాద్ సీపీ స్వయంగా వాహనం వద్దకు పాడె మోశారు. మృతుని కుటుంబాన్ని పోలీస్ శాఖాపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవయవదానంతో మరోసారి జీవించవచ్చన్నారు.
నివాళులర్పించిన వారిలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మీనారాయణ, జీవన్ దాన్ ఇన్ ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత, సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, జీవన్ దాన్ పీఆర్ఓ పవన్ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రాణాలకు రక్ష - సైబరాబాద్ పోలీసుల ‘మరోజన్మ’
ఆపధలో ఉన్న ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది గొప్ప విషయమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ అన్నారు. ఆర్గన్ డొనేషన్ చేసిన వారు భౌతికంగా మరణించినప్పటికీ జీవించి ఉన్నట్టే అన్నారు.
అవయవదానం పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గన్ డొనేషన్ శాతాన్ని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో రెండేళ్ల క్రితం 30.11.2018న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో ‘మరోజన్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం చేస్తే ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారిమవుతామన్నారు.
బ్రెయిన్ డెడ్ సమయంలో సమాచారం ఇచ్చేందుకు ల్యాండ్ లైన నంబర్ 040 2348 9495, 9603944026, 88850 60093 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు