ప్రవాసీయులపై ఒమనైజేషన్ ఎఫెక్ట్..తగ్గుతున్న మేనేజర్ల సంఖ్య
- November 22, 2020
మస్కట్:ఒమనైషన్ దెబ్బతో ఒమన్ లోని ప్రవాసీయుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కొత్త ఉద్యోగాల భర్తీలో కూడా ప్రవాసీయుల సంఖ్య తగ్గతూ వస్తోంది. ఈ విషయాన్ని ఒమన్ జాతీయ గణాంకాలు, సమాచార శాఖ (NCSI) స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది గత సెప్టెంబర్ నాటికి 29 వేల మంది ప్రవాసీయులకు పలు రంగాల్లో ఉపాధి దొరికినట్లు నవంబర్ కు సంబంధించి స్టాటిస్టికల్ బులెటిన్ లో ఎన్సీఎస్ఐ వెల్లడించింది. అయితే..ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఒమన్ లో 14,35,070 మంది ప్రవాసీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేసింది. అయితే..గత ఏడాది గణాంకాలతో పోలిస్తే ప్రస్తుత ప్రవాసీ ఉద్యోగుల సంఖ్య 17 శాతం తగ్గిందని, 2019లో ఇదే సమయానికి ఒమన్ లో 17,12,798 మంది ప్రవాసీ కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. కార్మికుల సంఖ్యతో పాటు వివిధ రంగాల్లో మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లోనూ ప్రవాసీయుల సంఖ్య 22.4 శాతం తగ్గినట్లు ఎన్సీఎస్ఐ లెక్కగట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలో 29,687 మంది ప్రవాసీయులు మేనేజర్ స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారని..గతేడాది ఇదే సమయానికి 37,603 మంది ఉన్నట్లు ఎన్సీఎస్ఐ వెల్లడించింది.
తాజా వార్తలు
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!









