సుశీలమ్మకు శతమానంభవతి
- November 22, 2020
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ సినీ నేపథ్య గాయని, గిన్నిస్ రికార్డు విజేత పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పి.సుశీల పాడిన తెలుగు సినీగీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో "గానకోకిల పాటకు పట్టాభిషేకం" అనే కార్యక్రమాన్ని అంతర్జాలం ద్వారా 21వ తేదీ 10 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించారు.
ప్రముఖ నటీమణి ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు చేతులమీదుగా ప్రారంభింపబడిన ఈ కార్యక్రమంలో భారత్ సింగపూర్ అమెరికా దేశాల నుండి 12 మంది ప్రముఖ గాయనీమణులు సుశీల పాటలను ఆలపించి అలరించగా, ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాలూరి కోటి, మాధవపెద్ది సురేష్, మరియు స్వర వీణాపాణి వంటి ప్రముఖులు అతిథులుగా విచ్చేసి సుశీల పాటలను గురించి ఆమెతో వారి అనుబంధాన్ని గురించి తెలియజేస్తూ ప్రసంగించారు.
రాధిక మంగిపూడి వ్యాఖ్యాననిర్వహణలో జరిగిన ఈ అద్వితీయ సంగీత మహోత్సవ కార్యక్రమంలో రాధిక నోరి (అమెరికా), విజయలక్ష్మి భువనగిరి, సురేఖ మూర్తి దివాకర్ల, వేదాల శశికళ స్వామి, శారదా రెడ్డి, శివశంకరి గీతాంజలి, శారద సాయి, శ్రీదేవి, రావూరి మాధవి, హిమబిందు, శైలజా చిలుకూరి (సింగపూర్), సౌభాగ్యలక్ష్మీ (సింగపూర్) 12 మంది సుమధుర గాయనీమణులు 100 పాటలను ఆలపించారు.
కార్యక్రమ ముఖ్య నిర్వాహకులుగా వంశీ ఇంటర్నేషనల్ మరియు సద్గురు ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ వ్యవస్థాపకఅధ్యక్షులు కవుటూరు రత్నకుమార్,ది గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపకఅధ్యక్షురాలు రాధిక మంగిపూడి మరియు శారదా కళాసమితి అధ్యక్షులు దోగిపర్తి శంకర్రావు వ్యవహరించి సుశీలకి వారి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలలనుండి వేలాది సినీ సంగీత ప్రేమికులు, సుశీల అభిమానులు అందరూ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరిగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసి వీనులవిందైన పాటలను ఆస్వాదించారు.
కార్యక్రమం ఆసాంతం ఈ క్రింది యూట్యూబ్ వీడియోలో చూడవచ్చును
https://fb.watch/1VX8U5F_f6/
https://fb.watch/1VXam9ZmJ_/


తాజా వార్తలు
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా









