ఆ ఉద్యోగాన్ని వలసదారులకు ఇవ్వడంలేదన్న కువైట్‌

- November 24, 2020 , by Maagulf
ఆ ఉద్యోగాన్ని వలసదారులకు ఇవ్వడంలేదన్న కువైట్‌

కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ అవ్‌కాఫ్‌ మరియు ఇస్లామిక్‌ ఎఫైర్స్‌, ఓ విదేశీయుడికి సలహాదారుడిగా ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో, ఓ మసీదు ఇమామ్‌గా పనిచేస్తున్న అరబ్‌ జాతీయుడికి, అవ్‌కాఫ్‌ మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ కార్యాలయంలో సలహాదారుగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ ప్రచారాన్ని మినిస్ట్రీ ఖండించింది. ఈ తరహా రూమర్స్‌ని ఎవరూ నమ్మకూడదని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, కువైట్‌ జనాభా 4.8 మిలియన్లు.. అందులో 3.4 మిలియన్ల మంది విదేశీయులే వున్నారు. అయితే, విదేశీయుల సంఖ్యను తగ్గించే క్రమంలో కువైట్‌ పలు చర్యలు చేపడుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com