హోం క్వారంటైన్‌ ఉల్లంఘన: జైలు శిక్ష, జరీమానా

- November 25, 2020 , by Maagulf
హోం క్వారంటైన్‌ ఉల్లంఘన: జైలు శిక్ష, జరీమానా

మస్కట్‌:హోం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంగించిన ఓ పౌరుడికి 20 రోజుల జైలు శిక్ష అలాగే 500 ఒమన్‌ రియాల్జ్‌ జరీమానా విధించారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. సౌత్‌ అల్‌ బతినా గవర్నరేట్‌లోని కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ఈ మేరకు తీర్పుని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో సుప్రీం కమిటీ సూచించిన నిబంధనల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది. ట్రాకింగ్‌ బ్రాస్‌లెట్‌ని తొలగించడం, హోం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించడం నేరంగా పరిగణించబడుతుంది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్‌)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com