తమిళనాడు ప్రజలకు మరో వరం

- February 18, 2016 , by Maagulf
తమిళనాడు ప్రజలకు మరో వరం

తమిళనాడు ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మరో వరం ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలివిడత ఈనెల 24 నుంచి చెన్నై నగరంలోని సిటీ బస్సుల్లో అమలు చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని జయలలిత ప్రకటించారు. సినీయిర్‌ సిటిజన్లు నెలలో పదిసార్లు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com