జై బాలయ్య టాటూల క్రేజ్

- February 18, 2016 , by Maagulf
జై బాలయ్య టాటూల  క్రేజ్

బాలయ్య ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పేది ఏముంది, అయన మాస్ హీరో..అయన చెప్పే డైలాగ్స్ , చేసే ఫైట్స్ కోసం థియేటర్స్ దగ్గర క్యూ కడతారు..అలాంటి బాలయ్య తాజాగా లేడి ఫాలోయింగ్ కూడా ఎక్కవయ్యారు..అది కూడా హీరో నాని వల్ల వివరాల్లోకి వెళ్తే..నాని తాజా చిత్రం కృష్ణగాడి వీర ప్రేమగాధ లో బాలయ్య అభిమానిగా నటించి చేతిపై జై బాలయ్య టాటూతో కనిపిస్తాడు. ఇలా బాలయ్యపై అభిమానాన్ని ఓ సీన్ కి పరిమితం చేయకుండా.. అడుగడుగునా చూపిస్తూ.. సినిమాకి బాగానే బాలయ్యను వాడుకున్నాడు దర్శకుడు.అదే టైంలో జై బాలయ్య టాటూ కూడా ట్రెండ్ అయిపోయింది. సినిమా రిలీజ్ నాటికే జై బాలయ్య టాటూలకు క్రేజ్ వచ్చేసింది. ఆన్ లైన్ లో ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసిన బాలయ్య ఫ్యాన్స్ జై బాలయ్య టాటూలతో ఫోటోలు దిగి ట్వీట్స్ చేయడం స్టార్ట్ చేశారు.ఇప్పుడు అమ్మాయిల్లోనూ ఈ ట్రెండ్ జోరుగా ఊపందుకుంది.అమ్మాయిల్లోనూ బాలయ్య అంటే ఎంత అభిమానం ఉంటుందో. ఇప్పుడు జై బాలయ్య టాటూలు నిరూపిస్తున్నాయి. ఇక విషయానికి వస్తే చక్కటి ప్రేమ కథ కు యాక్షన్ జోడించి సూపర్ హిట్ కొట్టాడు హను రాఘవపుడి. అలాగే నాని నటన లోను కొత్తగా ఉండడం ప్రేక్షకులు సినిమాకి భ్రహ్మ రధం పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com