భారత విదేశాంగ మంత్రికి షేక్‌ మొహమ్మద్‌ ఘన స్వాగతం

- November 26, 2020 , by Maagulf
భారత విదేశాంగ మంత్రికి షేక్‌ మొహమ్మద్‌ ఘన స్వాగతం

అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, భారత విదేశాంగ మంత్రి డాక్టర్‌ సుబ్రహ్మణ్యం జై శంకర్‌కి అబుదాబీలోని అల్‌ షాతి ప్యాలెస్‌లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రితో షేక్‌ అహమ్మద్‌ పలు అంశాలపై చర్చించారు. రాజకీయ, ఆర్థిక అంశాలు వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయి. అలాగే కరోనా వైరస్‌కి సంబంధించిన అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురూ చర్చించడం జరిగింది. భారత్‌ - యూఏఈ మధ్య మరింత మెరుగైన సంబంధాల కోసం ప్రధాని మోడీ కృషిని ఈ సందర్భంగా షేక్‌ మొహమ్మద్‌ కొనియాడారు. మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ డాక్టర్‌ అన్వర్‌ బిన్‌ మొహమ్మద్‌ గర్గాష్‌, అబుదాబీ ఎగ్జిక్యూటివ్‌ ఎఫైర్స్‌ అథారిటీ ఛైర్మన్‌ ఖల్దూన్‌ ఖలీఫా అల్‌ ముబారక్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com