లవ్ స్టోరి తో రెడీ అవుతున్నావరుణ్
- February 18, 2016
మెగా వారసుడిగా టాలీవుడ్ కి పరిచయం అయినా.. కమర్షియల్ సక్సెస్ అందుకోవటంలో వెనకపడుతున్న యంగ్ హీరో వరుణ్ తేజ్. ముకుంద, కంచె సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, తరువాత లోఫర్ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా అది వర్క్ అవుట్ కాలేదు. దీంతో ఆలోచనలో పడ్డ వరుణ్ నెక్ట్స్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.మరోసారి క్రిష్ దర్శకత్వంలో రాయబారి పేరుతో థ్రిల్లర్ సినిమా చేయాలని భావించినా, ప్రస్తుతానికి ఆ ఆలోచనను వరుణ్ పక్కన పెట్టేశాడు. కమర్షియల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవటం కోసం లవ్ స్టోరి తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఫీల్ మై లవ్ పేరుతో లవ్ స్టోరి ప్లాన్ చేస్తున్నాడు వరుణ్.అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య సినిమాలోని సూపర్ హిట్ పాట పల్లవినే టైటిల్ గా ఫిక్స్ చేసిన ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









