సౌదీ వ్యక్తుల నుంచి విడిపోయిన భార్యలు, భర్తల స్పాన్సర్ షిప్ బదిలీకి 2 నెలల గడువు
- November 26, 2020
సౌదీ మహిళలనుగానీ, సౌదీ పురుషుడ్నిగానీ పెళ్లి చేసుకొని ఏ కారణం చేతనైనా విడిపోయిన వ్యక్తులు రెండు నెలల్లో స్పాన్సర్ షిప్ ను బదిలీ చేసుకోవాలని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ఒకవేళ సౌదీని పెళ్లి చేసుకున్న ప్రవాసీయులు..తమ భాగస్వామి మృతి చెందినా రెండు నెలల్లోనే స్పాన్సర్ షిప్ బదిలీ చేసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే సౌదీ మహిళ, ప్రవాసీయుడ్ని వివాహమాడి..ఆమె సంతానం 18 ఏళ్లు నిండినట్లైతే వారికి కూడా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుందని వెల్లడించింది. రెండు నెలల గడువులోగా పైన చెప్పిన ప్రవాసీయులు, ప్రవాసీయురాలు తగిన ఉపాధిని చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రెండు నెలల గడువులోగా తగిన ఉద్యోగంలో చేరకపోతే..సదరు ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని కూడా సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. స్పాన్సర్ షిప్ బదిలీ కోసం..మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్ తో పాటు సౌదీని పెళ్లి చేసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. అలాగే పాస్ పోర్టు కూడా దరఖాస్తు ఫారమ్ తో జత చేయాలి.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







