మస్కట్: ఈశాన్య గాలులతో సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం

- November 27, 2020 , by Maagulf
మస్కట్: ఈశాన్య గాలులతో సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం

మస్కట్:రాబోయే రెండో రోజుల పాటు సుల్తానేట్ లోని సముద్ర తీరంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. ఓ మోస్తారు నుంచి పెద్ద పెద్ద అలలు ఎగిసిపడుతాయని వెల్లడించింది. సాధారణం కంటే ఒకటిన్నర నుంచి రెండున్నర మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడొచ్చని పేర్కొంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటు చేసుకుంటాయని, మరోవైపు  అల్ షార్కియా, అల్ వుస్టా, ధోఫర్ గవర్నరేట్ల పరిధిలోని ఏడారి ప్రాంతాల్లో ఇసుక గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com