అవినీతిపై పోరు: 200 మందికి పైగా అరెస్ట్
- November 27, 2020
రియాద్:అవినీతి కేసుల్లో 226 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. మొత్తం 158 కేసులకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయి. యాంటీ కరప్షన్ అథారిటీ (నజాబా), ఆయా వ్యక్తులపై అవినీతి అభియోగాలు మోపింది. వీటిల్లో ఓ కేసు ఆగస్ట్‌లో రిజిస్టర్ కాగా, డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన అధికారులు అలాగే సివిలియన్స్ మధ్య ఓ అవినీతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిందితులకు సంబంధించి కేసు వివరాలు వెల్లడయ్యాయి. 1.229 బిలియన్ రియాల్స్ లంచం ఈ కేసులో జరిగిందని అధికారులు తెలిపారు. విచారణ సందర్భంగా 19 మంది డిఫెన్స్ మినిస్ట్రీ ఉద్యోగులు, ముగ్గురు సివిల్ సర్వెంట్లు, 18 మంది వ్యాపారవేత్తలు, వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న 8 మందిని నిందితులుగా తేల్చారు. మరో కేసులో రిటైర్డ్ నేషనల్ గార్డ్ ఆఫీసర్ నిందితుడిగా వున్నారు. 8.2 మిలియన్ సౌదీ రియాల్స్ లంచం తీసుకున్నట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..