అబుధాబి:10 సెకెండ్లలో 144 ఫ్లోర్స్‌ భవనం కూల్చివేత

- November 27, 2020 , by Maagulf
అబుధాబి:10 సెకెండ్లలో 144 ఫ్లోర్స్‌ భవనం కూల్చివేత

అబుధాబి:అబుధాబిలోని మినా జాయెద్‌ ప్రాంతంలోగల మినా ప్లాజాని విజయవంతంగా కుప్పకూల్చేశారు. కేవలం 10 సెకెండ్లలో భవనం నేలమట్టమయ్యింది. అబుధాబి మీడియా ఆఫీస్‌ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది. మినా జాయెద్‌ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కూల్చివేత చేపట్టారు. కూల్చివేత సందర్భంగా వచ్చే దుమ్ము, వ్యర్థాల్ని కంట్రోల్‌ చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామనీ, అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయని అధికారులు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, పేలుడు పదార్థాల సాయంతో ఈ భవనాన్ని కూల్చివేశారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మునిసిపాలిటీస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, మోడోన్‌ని ఈ కూల్చివేతల కోసం వినియోగించడం జరిగింది. అబుదాబీ సివిల్‌ డిఫెన్స్‌ అథారిటీ, నేషనల్‌ అంబులెన్స్‌ అలాగే ఎమర్జన్సీ క్రైసిస్‌ మరియు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ సంయుక్త కార్యాచరణతో ఈ కూల్చివేత చోటు చేసుకుంది. మినా జాయెద్‌ సెకెండ్‌ ఫేజ్‌ అభివృద్ధి కోసం ఈ భవనాన్ని తొలగించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com