అరేబియా సముద్రంలో కులిపోయిన మిగ్-29 శిక్షణ విమానం
- November 27, 2020
న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం నిన్న సాయంత్రం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ మేరకు నేవీ అధికారులు విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని, రెండో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు.
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







