అరేబియా సముద్రంలో కులిపోయిన మిగ్‌-29 శిక్షణ విమానం

- November 27, 2020 , by Maagulf
అరేబియా సముద్రంలో కులిపోయిన మిగ్‌-29 శిక్షణ విమానం

న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే శిక్షణ విమానం నిన్న సాయంత్రం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. శిక్షణలో భాగంగా అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు ఎయిర్‌క్రాఫ్ట్‌ కూలిపోయింది. ఈ మేరకు నేవీ అధికారులు విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోయే ముందు ఇద్దరు పైలట్లూ బయట పడ్డారని, ఓ పైలట్ క్షేమంగా బయట పడ్డారని, రెండో పైలట్ కోసం వెతుకులాట కొనసాగుతోందని భారత నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు.
కనిపించకుండా పోయిన పైలట్ కోసం వాయుసేనతో పాటు సైన్యం సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని అన్నారు. ఈ యుద్ధ విమానం గోవా సమీపంలో మోహరించివున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య నుంచి తన నిఘా కార్యకలాపాల నిమిత్తం పని చేస్తోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇండియా వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com