చింతపండు తో ఆరోగ్య ప్రయోజనాలు
- November 29, 2020
చింతపండు రసం వేసి పప్పు, పులుసు ఏ వంట చేసినా రుచి అమోఘం. వంటకి రుచిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందించే చింతపండులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. భారతదేశంలో అత్యంత విలువైన సహజ ఆహారపదార్థాల్లో చింతపండు ఒకటి. ఢిల్లీకి చెందిన న్యూట్రిషనిస్ట్ తోమర్.. చింతపండులోని ఔషధ గుణాలు వివరిస్తూ ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ని కలిగి ఉందని, ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని నిరోధిస్తుందని తెలియజేశారు. చింతపండు అందించే కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము..
1. చింత పండులో ఉన్న ఫైబర్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. 2. చింతపండులో ఉన్న పొటాషియం కారణంగా రక్తపోటును, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఐరన్ రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. 3.చింతపండు హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్ (హెచ్‌సిఎ) అని పిలువబడే అతి ముఖ్యమైన సమ్మేళనాలలో ఒకటి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. శరీరంలోని ఎంజైమ్‌ను నిరోధిస్తుంది, కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన చింతపండుతో చేసిన ఆహార పదార్ధాలు తిన్న తరువాత కడుపు నిండుగా ఉంటుంది. దీంతో జంక్ ఫుడ్డు లేదా అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తుంది.బరువు తగ్గేందుకు కొద్దిగా చింతపండు తీసుకుని గ్లాసు నీిటిలో వేసి వేడి చేయాలి. చల్లారిన తరువాత రసం పిండి ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిలో రుచి కోసం ఓ స్పూన్ తెనె, ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగాలి. 4. చింతపండు విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప వనరు. శరీరం ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిరోధిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 5. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆర్థరైటిస్, కీళ్ల నొప్పి, గౌట్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. 6. చింతపండులో ఉన్న విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయసుతో పాటు వచ్చే కంటి సంబంధిత శుక్లాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కళ్లు పొడి బారడాన్ని తగ్గిస్తుంది. చింతపండును నీటిలో ఉడకబెట్టి చేసిన కషాయాన్ని తాగడం వల్ల కంటి వాపు రాకుండా ఉంటుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు