భారత్ లో 94 లక్షలకు చేరువలో కరోనా కేసులు...
- November 29, 2020
న్యూఢిల్లీ : భారత దేశంలో కరోనా కేసులు 94 లక్షల చేరువలో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 41,810 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా వైరస్ కేసులు 93,92,919కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో 496 మందిని కరోనా బలితీసుకుంది. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 1, 36, 696కి చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 42,298 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 88,02,267 మంది ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం 4,53,956 యాక్టివ్ కేసులున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 13,95,03,803 మందికి పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 6,250 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 5,900 కేసులు నమోదు కాగా...ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 18 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







