అఫ్గాన్‌లో కారు బాంబు పేలుడు: 30 మంది మృతి
- November 29, 2020
కాబుల్:అఫ్గానిస్తాన్‌లో దారుణం చేటు చేసుకుంది. ఆదివారం ఆత్మాహుతి కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం స్థానిక ఆర్మీ బేస్ ప్రాంతంలో జరగడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఘాజీ నగర శివారు ప్రాంతంలో ఉన్న తూర్పు ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఈ దాడిలో ఇప్పటివరకు 26 మృతదేహాలను గుర్తించాము. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రభుత్వ భద్రత సిబ్బంది’ అని స్థానిక ఘాజీ ఆస్పత్రి డైరెక్టర్ బాజ్ మహ్మద్ హేమత్ తెలిపారు.
ఇక ఈ ప్రాంతాల్లో తరచూ తాలిబన్లు, ప్రభుత్వ బలగాల మధ్య దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో మృతులకు సంబంధించిన సంఖ్యను ఘాజీ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యుడు నాసిర్ అహ్మద్ వెల్లడించారు. అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ వాహనాన్ని పేలుడు పదార్ధాలతో పేల్చివేశారు. బామియన్‌లో రెండు బాంబు పేలుళ్ల ఘటనలు మరవక ముందే ఆదివారం ఘాజీలో ఆత్మాహుతి కారు బాంబు దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాలో గత సెప్టెంబర్ 12న జరిగిన శాంతి చర్చల అనంతరం అఫ్గానిస్తాన్‌లో జరిగిన అతి పెద్ద బాంబు పేలుడు దాడి ఇదే.
తాజా వార్తలు
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!







