న్యూడిజైన్లలో ఎమిరేట్స్ ఐడీలు, పాస్ పోర్టులు..యూఏఈ మంత్రివర్గం నిర్ణయం

- November 30, 2020 , by Maagulf
న్యూడిజైన్లలో ఎమిరేట్స్ ఐడీలు, పాస్ పోర్టులు..యూఏఈ మంత్రివర్గం నిర్ణయం

దుబాయ్:ఎమిరేట్స్ ఐడీ కార్డులు, పాస్ పోర్టులకు న్యూలుక్ రానుంది. మరింత భద్రత ప్రమాణాలు, న్యూ జనరేషన్ డిజైన్లతో ఎమిరేట్స్ ఐడీ కార్డులు, పాస్ పోర్టులను భర్తీ చేయాలని యూఏఈ మంత్రివర్గం నిర్ణయించింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం...ఐడీ, పాస్ పోర్టు డిజైన్లతో పాటు సైబర్ సెక్యూరిటీ మండలి ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తూ.. పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ సుల్తాన్ అల్ జబెర్ ను యూఏఈ ప్రతినిధిగా నియమించింది. ప్రకృతి ఎదుర్కొంటున్న సవాళ్లు, పర్యావరణ మార్పులపై జరిగే ప్రపంచ సదస్సులకు ఆయన యూఏఈ తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాదు..కింగ్డమ్ పరిధిలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలను తీసుకుంటారు. పర్యావరణ పరిక్షణ పాలసీ కింది మొత్తం 8 అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని, తద్వార క్లైమెట్ పై ప్రభావం చూపే అంశాలను నివారించటం, ప్రకృతి సంపదను కాపాడుకోవటం, గాలిలో స్వచ్ఛతను పెంపొందించేలా చర్యలు చేపట్టడం...పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించటం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com