విజిట్ వీసాదారులు ఈ అర్ధరాత్రికల్లా వెళ్లిపోవాల్సిందే..కువైట్ స్పష్టీకరణ
- November 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లో రెసిడెన్సీ అనుమతి గడువు ముగిసిన వాళ్లకు మరో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని కువైట్ స్పష్టం చేసింది. ముఖ్యంగా విజిట్ వీసాలపై కువైట్ లో ఉంటున్నవారు ఒకవేళ తమ వీసా, నివాస అనుమతి గడువు ముగిస్తే...ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి(నవంబర్ 30)నాటికి దేశం విడిచి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి ప్రతీ రోజు KD 2 ఫైన్ చెల్లించాలని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘనులకు లాక్ డౌన్, కర్ఫ్యూ, విమాన ప్రయాణాలపై ఆంక్షల కారణంగా 7 నెలల గడువు ఇచ్చామని...ఇంకా గడువు పొడిగింపు ఆశించిటం సరికాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం సూచించిన గడువులోగా దేశం విడిచి వెళ్లకపోతే...జరిమానాతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో మళ్లీ వారిని కువైట్ లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే..ఈ ఏడాది ఫస్ట్ జనవరి నాటికి కువైట్ లో 1,30,000 మంది ప్రవాసీయులు రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించి దేశంలో ఉంటున్నారని ప్రభుత్వం వివరించింది. వాళ్లందరికీ రెసిడెన్సీ స్టేటస్ ను మార్చుకునేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకొవాలని సూచించింది. నిర్ణీత గడువులోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్పిడికి దరఖాస్తు చేసుకున్నవారికి ఎలాంటి విచారణ ఉండదని, అలాగే దేశం విడిచి వెళ్లేందుకు మార్గం సుగమమం అవుతుందని వెల్లడించింది. కువైట్ పరిధిలోని ఆరు గవర్నరేట్లలోని రెసిడెన్సీ డిపార్ట్మెంట్లలో రెసిడెన్సీ స్టేటస్ ను ఫైన్ చెల్లించి సవరించుకోవచ్చని వెల్లడించింది. ఒక వేళ నిర్ణీత గడువులోగా స్టేటస్ ను మార్చుకోకుంటే..వారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని, తిరిగి కువైట్ కు వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







