అమరవీరులకు నివాళులు అర్పించిన యూఏఈ
- November 30, 2020
యూఏఈ: జాతిని రక్షించేందుకు ప్రాణాలు ఒడ్డిన అమరవీరుల జ్ఞాపక దినోత్సవంగా నవంబర్ 30 ను ప్రతి ఏటా అమరవీరుల స్మారకదినోత్సవంగా జరుపుకుంటోంది యూఏఈ.
అమరవీరుల కుటుంబాల వ్యవహారాల కార్యాలయం, యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసీయులను ఉద్దేశించి ఉదయం 11.31 గంటల వరకు ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతూ పంపిన ఎస్ఎంఎస్ ను అనుసరించి నేడు సరిగ్గా ఉదయం 11.30 గంటలకు యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసులు ఒక నిమిషం మౌనం పాటిస్తూ సైనికులకు నివాళులర్పించారు.
నివాసితులు వారి ప్రశంస సందేశాలను #Proud_of_your_sacrifices ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని యూఏఈ కోరింది. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండ్ గా మారింది.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వీరులకు నివాళులు అర్పించారు. యూఏఈ లోని ఉన్నతాధికారులు సైతం తమ నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం