తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు
- November 30, 2020
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,058 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,69,816కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,58,336కి మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,458కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,459 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 119 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







