అంబాసిడర్‌గా ఎంపికైన రెహమాన్
- November 30, 2020సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ అవార్డ్ అందుకున్న రెహమాన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా రెహమాన్‌ని నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్ రెహమాన్‌ను అంబాసిడర్‌గా నియమించింది.
ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రెహమాన్.. బాఫ్టాతో పని చేస్తూ.. సినిమాలు, టీవీ, ఆట ఇలా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం ఉత్సాహంగా ఉన్నాను అని పేర్కొన్నారు . భారత్‌లో అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నట్టు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి