చైనా ఎత్తుగడ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు!

- November 30, 2020 , by Maagulf
చైనా ఎత్తుగడ.. బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టు!

బ్రహ్మపుత్ర నదిపై చైనా డ్యామ్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నది. టిబెట్‌లో ఆ హైడ్రోపవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను చైనా తన 14వ పంచవర్ష ప్రణాళికలో కేటాయించించింది. డ్యామ్ నిర్మాణానికి చైనా కంపెనీకి కూడా బాధ్యతలు అప్పగించినట్లు కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. చైనా పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ యాన్ జియాంగ్ ఈ అంశంపై మాట్లాడారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ జాంగ్బో నదిగా పిలుస్తారు. అయితే ఆ నదిపై హైడ్రోపవర్ డ్యామ్‌ను కట్టనున్నట్లు యాన్ జియాంగ్ తెలిపారు. జలవనరులు, స్వదేశీ భద్రత అంశాలను కూడా ఆ డ్యామ్‌తో పరిశీలించనున్నట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. చరిత్రలో ఇటువంటి సందర్భం ఏదీ లేదని, చైనా హైడ్రోపవర్ పరిశ్రమకు ఇదో అద్భత అవకాశం అని యాన్ జియాంగ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్‌పీసీ సమావేశాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను వెల్లడించనున్నారు.

బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కట్టాలనుకుంటున్న చైనా ప్రతిపాదన పట్ల భారత్‌, బంగ్లాదేశ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ చైనా మాత్రం అటువంటి సమస్య ఏదీ ఉండదని పేర్కొన్నది. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని డ్యామ్ కట్టేందుకు పూనుకున్నట్లు చైనా చెప్పింది. దిగువ దేశాల ప్రయోజనాల గురించి ఆలోచించాలని పలుమార్లు చైనాకు భారత్ అభ్యర్థన చేసింది. ఇప్పటికే టిబెట్‌లో 2015లో జామ్ హైడ్రోపవర్ స్టేషన్‌ను సుమారు 1.5 బిలియన్ల డాలర్ల ఖర్చుతో చైనా నిర్మించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దుల్లో ఉన్న టిబెట్‌లోని మిడాంగ్ జిల్లాలో కొత్త డ్యామ్‌ను చైనా నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com