అంబాసిడర్‌గా ఎంపికైన రెహమాన్
- November 30, 2020
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆస్కార్ అవార్డ్ అందుకున్న రెహమాన్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా రెహమాన్‌ని నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్ రెహమాన్‌ను అంబాసిడర్‌గా నియమించింది.
ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రెహమాన్.. బాఫ్టాతో పని చేస్తూ.. సినిమాలు, టీవీ, ఆట ఇలా పలు రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచే వారిని గుర్తించడం కోసం ఉత్సాహంగా ఉన్నాను అని పేర్కొన్నారు . భారత్‌లో అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నట్టు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







