మూడు వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలతో ప్రధాని మోదీ సమీక్ష
- November 30, 2020
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. జెనోవా జయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోడి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు, సామర్థ్యం తదితర సమాచారాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా తేలికైన భాషలో చెప్పేందుకు ప్రయత్నించాలని కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న ఫార్మా సంస్థలకు ప్రధాని మోడి సూచించారు. వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. పుణెకు చెందిన జెనోవా బయోఫార్మా లిమిటెడ్, హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీ తదితర అంశాలపైనా ప్రధాని చర్చించినట్టు పీఎంఓ కార్యాలయం తెలిపింది. వ్యాక్సిన్ అభివృద్ధికి మూడు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మోడి ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







