ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
- November 30, 2020
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,68,064కి చేరింది. ఇందులో 7840 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,53,232 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 4 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,992కు చేరుకుంది. ఇక నిన్న 934 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,00,57,854 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 21, చిత్తూరు 31, తూర్పుగోదావరి 45, గుంటూరు 35, కడప 26, కృష్ణా 70, కర్నూలు 12, నెల్లూరు 19, ప్రకాశం 7, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 11, విజయనగరం 20, పశ్చిమ గోదావరి 74 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,291కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 827 మంది కరోనాతో మరణించారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..