నేషనల్ డే: స్టే హోమ్ సెలబ్రేషన్స్
- December 01, 2020
యూఏఈ రెసిడెంట్స్ గతంలోలాగా ఎక్కువమంది గుమికూడి యూఏఈ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం కాకుండా, ఇంటి వద్దనే వుండి సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. వర్చువల్ ఫెస్టివిటీస్‌లో పాల్గొనేందుకు చాలామంది ఉత్సాహం ప్రదర్శించారు. ఆన్‌లైన్ వేదికగా కొనుగోళ్ళు, వర్చువల్ విధానంలో సంబరాలు.. ఇదంతా కొత్తగా వుందని పలువురు రెసిడెంట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ స్టే హోం సెలబ్రేషన్స్ జరుగుతున్న దరిమిలా, అథారిటీస్‌కి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని, వారి ఆదేశాల్ని పాటిస్తామని రెసిడెంట్స్ అంటున్నారు. ఇంట్లో వున్నా, ఆన్‌లైన్ అలాగే వర్చువల్ విధానం ద్వారా ఆ లోటు తెలియడంలేదని పలువురు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా ఆయా ఈవెంట్స్‌ని చూడలేకపోతున్న తాము, ఇంట్లోనే కూర్చుని వాటిని వీక్షిస్తున్నామని కొందరు చెబుతోంటే, ఇంటి మేడపైనకి వెళ్ళి ఎయిర్ షోలను చూస్తున్నట్లు ఇంకొందరు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని తప్పక పాటిస్తున్నామని భారత వలసదారులైన శ్రేయా చక్రవర్తి చెప్పారు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!