రైతులకు వారి హక్కులు కల్పించాలి-రాహుల్‌ గాంధీ

- December 01, 2020 , by Maagulf
రైతులకు వారి హక్కులు కల్పించాలి-రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి నిరసన తెలుపుతన్న రైతులకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రం అహంకారాన్ని వీడి.. రైతులకు వారి హక్కులు కల్పించాలని అన్నారు. ‘మనకు అన్నం పెట్టే రైతన్నలు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు.. కానీ టీవీల్లో మాత్రం అబద్ధపు ప్రసంగాలు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అన్నదాతల శ్రమకు మనం ఎప్పటికీ రుణపడి ఉన్నాం. అలాంటి రైతులకు న్యాయం, హక్కులు కల్పించి రుణం తీర్చుకోవాలి. వారిపై లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించి కాదు. ఇకనైనా మేల్కోండి.. అహంకారమనే కుర్చీ నుంచి దిగి రైతులకు హక్కులు కల్పించండి’ అని కేంద్రానికి సూచిస్తూ ట్వీట్‌ చేశారు.

కాగా, కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ రైతులు ఆరు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com