యూఏఈ నేషనల్ డే: భద్రతకోసం 127 పోలీస్ పెట్రోల్స్
- December 01, 2020
షార్జా: 49వ యూఏఈ నేషనల్ డే, ఈ నేపథ్యంలో వచ్చిన నాలుగు రోజుల సెలవుల దృష్ట్యా మొత్తం 127 పెట్రోల్స్‌ని షార్జా వ్యాప్తంగా మోహరించారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా.? లేదా.? అనే విషయమై పోలీస్ పెట్రోల్స్ పరిశీలించనున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో బీచ్‌లకు వెళ్ళేవారు, ఎడారులు సహా, ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళే వివిధ ప్రదేశాల్లో కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ మీడియా బ్రాంచ్ డైరెక్టర్ కెప్టెన్ సౌద్ అల్ షాయిబా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. మేరిటైమ్ రెస్క్యూ పెట్రోల్స్‌ని బీచ్‌లలో రక్షణ కోసం వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్‌లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







