భారత్ ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదు…

- December 01, 2020 , by Maagulf
భారత్ ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదు…

న్యూ ఢిల్లీ:భారత దేశం ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అయితే కరోనా వ్యాప్తి అరికట్టేలా భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తే సరిపోతుందని వెల్లడించారు.

వైరస్​ వ్యాప్తిని నియంత్రించడమే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సిన్​ను ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ టీకా అందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టీకా సమర్థత ఆధారంగా వ్యాక్సినేషన్ ఆధారపడి ఉంటుందని అన్నారు. కొవిషీల్డ్ దుష్ప్రభావంపై..సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న కొవిషీల్డ్ మానవ ట్రయల్స్​ వల్ల దుష్ప్రభావాలు తలెత్తాయన్న కథనాలపై రాజేశ్ స్పందించారు.

ట్రయల్స్ నిలిపివేసే విధంగా ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటపడలేదని అన్నారు. టీకా ప్రయోగాలపై ‘సమాచార భద్రత పర్యవేక్షణ బోర్డు’ రోజువారీ పర్యవేక్షణ చేపడుతోందని తెలిపారు. ప్రతికూల ప్రభావాలు తలెత్తితే గుర్తించి, నివేదిక అందిస్తుందని అన్నారు. క్లినికల్ ట్రయల్స్​ వల్ల తలెత్తే దుష్ప్రభావాల​ గురించి వలంటీర్లకు ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com