నిరుద్యోగులకు గూగుల్ గుడ్‌న్యూస్…
- December 01, 2020
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. గూగుల్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఈ ఇంటర్న్‌షిప్ కు అవకాశమిస్తోంది. పూర్తి వివరాలతో పాటు https://careers.google.com/వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ.
ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది.
ఇతర అర్హతలు:
జావా, సీ++, పైథాన్‌లో అనుభవం ఉండాలి. సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ లేదా ఆల్గారిథమ్స్ తెలిసి ఉండాలి. వీటితో పాటు SQL, Spring, Hibernate, Web Services (RESTful, SOAP), JavaScript తెలిసి ఉండాలి.
దరఖాస్తు విధానం:
మొదటhttp://https://careers.google.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అందులో Application Engineering Intern, Summer 2021 సెర్చ్ చేయాలి.
అందులో హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
అందులో ఇంటర్న్‌షిప్ వివరాలు ఉంటాయి.
దరఖాస్తు చేయాలనుకుంటే Apply పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత జీ-మెయిల్ ఐడీతో లాగిన్ కావాలి.
అనంతరం సీవీ లేదా రెజ్యూమె అప్‌లోడ్ చేయాలి.
విద్యార్హతల వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం