కువైట్:ఈ నెల 7 నుంచి ఇండియన్ డొమస్టిక్ వర్కర్ల ఎంట్రీకి పర్మిషన్
- December 02, 2020
కువైట్ సిటీ:డొమస్టిక్ వర్కర్ల ఎంట్రీకి సంబంధించి కువైట్ సివిల్ ఏవియేషన్ అధికారులు..తమ ప్రణాళికను వివరించారు. రెండు దశలుగా డొమస్టిక్ వర్కర్లను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో భారత్, ఫిలప్పెన్స్ నుంచి కార్మికులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన దేశాల నుంచి వచ్చే వారికి అనుమతి ఇస్తామని స్పష్టత ఇచ్చారు. భారత్, పిలిప్పెన్స్ రావాలనుకునే గృహ కార్మికులు...ఈ నెల 7 నుంచి రావొచ్చని పేర్కొన్నారు. అయితే..కార్మికులు కువైట్ లో పని చేర ప్రక్రియను కూడా రెండు భాగాలు విభజించామని, ఇందులో తొలి భాగంలో ఎవరైతే డొమస్టిక్ వర్కర్లు కువైట్ రావాలనుకుంటున్నారో..వారి వివరాలతో సంబంధిత స్పాన్సర్ ఆన్ లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే వరకు స్పాన్సర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే..కార్మికులను నేరుగా కువైట్ కు వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటారా...లేదంటే ఇతర దేశాల మీదుగా వచ్చేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారా అనేది స్పాన్సర్లే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కూడా అధికారులు తెలిపారు. ఇన్నాళ్లు ఇతర దేశాల మీదుగా రావటం వల్ల అక్కడ రెండు వారాలు..కువైట్ చేరుకున్నాక మరో రెండు వారాలు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు నేరుగా కువైట్ చేరుకునే వెసులుబాటు ఉండటంతో స్పాన్సర్లకు ఖర్చు ఆదా అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక రెండో భాగంలో...కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కార్మికులను క్వారంటైన్ కేంద్రానికి తరలించి, అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలని...ఇందుకు ఒక్కో కార్మికుడికి KD270 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
బ్యాన్డ్ కంట్రీస్ నుంచి కూడా డొమస్టిక్ వర్కర్లకు పర్మిషన్ ఇవ్వటంతో దాదాపు 80 వేల మంది కార్మికులు కువైట్ చేరుకుంటారని కువైట్ సివిల్ ఏవియేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం క్వారంటైన్ కేంద్రాలుగా 58 బిల్డింగ్ లను కేటయించినట్లు వివరించారు. తొలి దశలో భాగంగా దాదాపు నాలుగు నెలల పాటు డొమస్టిక్ వర్కర్లను అనుమతి ఇస్తామని, తొలి దశ ప్రణాళిక అమలు తీరును బట్టి కొనసాగించాలా..కొన్నాళ్ల తర్వాత పునరుద్ధరించాలా అనేది నిర్ణయిస్తామని అధికారులు స్పష్టత ఇచ్చారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!