బహ్రెయిన్ బోట్లను అడ్డుకున్న ఖతార్..తప్పుబట్టిన బహ్రెయిన్ ప్రభుత్వం
- December 02, 2020
మనామా:తమ సముద్ర ప్రాదేశీక జలాల్లోకి వచ్చారంటూ ఖతార్ కోస్ట్ గార్డు బృందాలు..తమ బోట్లను అడ్డుకోవటంపై బహ్రెయిన్ తప్పుబట్టింది. బహ్రెయిన్ కు చెందిన బోట్లు తమ పరిధిలోని ప్రాదేశిక జలాల్లోనే ఉండగానే...వాటిని ఖతార్ అడ్డుకోవటం సరికాదంటూ ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేసింది. ఇప్పుడు మళ్లీ తమ బోట్లను అడ్డుకొని ఖతార్ కోస్ట్ గార్డ్ తమ దురుసుతనాన్ని పదే పదే చాటుకుంటున్నాయని అభ్యంతరం తెలిపింది. అంతేకాదు...ప్రాదేశిక జలాల్లో పాటించాల్సిన అంతర్జాతీయ నిబంధనలను కూడా ఖతార్ పాటించటం లేదని ఆరోపించింది. నిబంధనల మేరకు ఖతార్ కోస్ట్ గార్డ్ తమ పతాకాలను ప్రదర్శించాల్సి ఉన్నా...అలాంటి చర్యలు తీసుకోలేదని వివరించింది. అదే సమయంలో ఖతార్ కు చెందిన రెండు బోట్ల కెప్టెన్లు అంతర్జాతీయ నిబంధనల మేరకు పతాకాలను ప్రదర్శించటంతో పాటు..అంతర్గత మంత్రిత్వ శాఖ చిహ్నాన్ని కూడా ప్రదర్శించి స్వీయ నియంత్రణను, క్రమశిక్షణను, వృత్తి విలువలను చాటుకున్నారని ప్రశంసించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!