యూఏఈ నేషనల్ డే వేడుకల వేళ దేశ గర్వాన్ని చాటుతూ కవిత విడుదల చేసిన షేక్ మొహమ్మద్
- December 02, 2020
యూఏఈ:49వ జాతీయ దినోత్సవ వేడుకల వేళ...యూఏఈ ప్రజల సుఖ సంతోషాలు కోరుతూ, దివంగత పాలకులకు నివాళులు అర్పిస్తూ, జాతి గర్వాన్ని చాటుతూ కవితను విడుదల చేశారు ఆ దేశ ఉపాధ్యక్షుడు షేమ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. తన కవితను అబుధాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ కమాండ్ షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ కు అంకితం ఇస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక మాండలికం, క్లాసికల్ అరబిక్ సాహిత్యం కలగలిపి రాసిన తన కవితకు 'ఏ నేషనల్ డే' అనే శీర్షికను పెట్టారు షేక్ మొహమ్మద్. తన కవితలో యూఏఈ వ్యవస్థాపక పాలకులు, దివంగత షేక్ జయాద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, షేక్ జయాద్ మొహమ్మద్ బిన జయాద్ లను కీర్తిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు. అంతేకాదు..నిశీతమైన దృఢ భక్తి చింతన, దేశం పట్ల, పాలకులు, ప్రజల పట్ల తన ప్రేమాభిమానాన్ని ఆత్మీయంగా వ్యక్తపరిచారు. యూఏఈ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వారి ఆకాంక్షలు నేరవేరాలని, యూఏఈ ఎప్పటికీ టాప్ లో ఉండాలని తన కవితలో కోరుకున్నారాయన.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని