CoronaVirus Vaccine: హెచ్చరిస్తున్న WHO
- December 06, 2020
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న సమస్య కరోనా వైరస్ (CoronaVirus). ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి కొన్ని నెలల్లో విముక్తి కలగనుందా.. ప్రపంచ దేశాలు మళ్లీ తిరిగి పాత రోజులను ఆస్వాదించనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలోనే కరోనా వైరస్ పీడ విరగడ కానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిపతి టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసిస్ అన్నారు. పలు దేశాలలో జరుగుతున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం డబ్ల్యూహెచ్ఓ (World Health Organisation) అధిపతి గేబ్రియోసిస్ మాట్లాడారు. కరోనా వైరస్ అంతం కానుందని ప్రపంచ దేశాలు కలలు కనొచ్చునని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మరో విషయంపై హెచ్చరించారు. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం భారీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్నారు. కొన్ని దేశాల్లో స్వప్రయోజనాల స్వార్థంతో కరోనా కేసులు పెరుగుతున్నట్టు టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.
కాగా, భారత్‌లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి చలి ప్రదేశాలలో కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అప్పటివరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రజలకు సూచిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు