ప్రభాస్ సినిమాకు తలనొప్పిగా మారిన సైఫ్ అలీ ఖాన్
- December 06, 2020
ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో ప్లాన్ చేస్తున్న మైథలాజికల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో రాముని పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా మరో అంతే ప్రాధాన్యత ఉన్న మరో పాత్ర రావణుని పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.
ఇప్పుడు ఇదే సైఫ్ మూలాన ప్రభాస్ సినిమాకు సరికొత్త తలనొప్పి మొదలయ్యినట్టు తెలుస్తుంది. ఇటీవలే సైఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందిలో రావణుడు సీత అపహరణను చేదుగా కాకుండా మంచిగా చూపిస్తారని అంటే అది అర్ధవంతంగా ఉంటుంది అని అన్నాడు.
దీనితో ఇక్కడ నుంచి బాలీవుడ్ జనాల్లో మరియు ప్రభాస్ అభిమానుల్లో మరింత స్థాయిలో నెగిటివిటీ మొదలయ్యింది. అతన్ని ఈ సినిమా నుంచి తీసేయాలని దర్శకుడు ఓంరౌత్ ను డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం సైఫ్ చేసిన స్టేట్మెంట్ ప్రభాస్ సినిమాకు కాస్త ఆందోళనకరంగా మారింది. మరి మేకర్స్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు