ఒమన్: వచ్చే ఏడాది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తొలగింపు

- December 07, 2020 , by Maagulf
ఒమన్: వచ్చే ఏడాది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తొలగింపు

వచ్చే ఏడాది నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యిద్ వెల్లడించారు. కార్మిక విధానాల్లో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 16వ ఐఐఎస్ఎస్ మనామా సదస్సులో మాట్లాడిన ఆయన...ఇన్నాళ్లుగా తమ దేశం అవలంభించిన నిరంభ్యంతర షరతుల విధానాల తొలిగించబోతున్నామని అన్నారు. ఇది ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా సుల్తానేట్ ఆర్ధికాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. దీంతో పాటు దేశంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా వీసా విధానాల్లోనూ మార్పు తీసుకొస్తున్నట్లు తెలిపారు. దాదాపు వంద దేశాలకు చెందిన పౌరులు ఒమన్ కు వీసా లేకుండా ప్రయాణించేలా తాము ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. నెల రోజుల పాటు దేశంలో పర్యటించే వారికి వీసా ఫ్రీ విధానాన్ని ప్రకటించబోతున్నట్లు తెలిపారు. వీసా విధానాల్లో మార్పులు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ విధానం తొలగింపు జనవరి 1,2021 నుంచి అమలు చేయబోతున్నట్లు..తద్వారా ప్రవాసీయులు తమ ఉద్యోగాల్లో చేరేందుకు కూడా లైన్ క్లియర్ అవుతుందని విదేశాంగ శాఖ మంత్రి అన్నారు. 

 - లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com