గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం

- December 07, 2020 , by Maagulf
గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం

న్యూఢిల్లీ: కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడిన సంగతి తెలిసిందే. అయితే మెళ్లిగా అన్ని రంగాలూ తిరిగి తమ పనులను మొదలుపెడుతున్నాయి. మహమ్మారి ప్రభావం అంతరిక్ష ప్రయోగాలు చేసే ఇస్రోపైనా పడింది. అయితే మిగిలిన రంగాల్లా స్పేస్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో పనులను మునుపటిలా చేయడం కష్టసాధ్యమని ఇస్రో చైర్‌పర్సన్ కె.కె.శివన్ అన్నారు. కరోనా కారణంగా భారత ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష మిషన్ అయిన గగన్‌యాన్ ఏడాది పాటు ఆలస్యం అవ్వొచ్చునని తెలిపారు.

వచ్చే ఏడాది ఆఖరులో లేదా తదుపరి సంవత్సరం ఈ మిషన్‌ను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు శివన్ చెప్పారు. ఈ ఏడాదిలోనే లాంచ్ చేయాలని ప్లాన్ చేసిన భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్‌1 కూడా ఆలస్యం కానుందన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా స్పేస్ యాక్టివిటీస్ చేయలేమని, స్పేస్ ఇంజనీర్లు ల్యాబ్స్‌లో అందుబాటులో ఉంటేనే పని చేయడం సాధ్యమవుతుందన్నారు. లాంచింగ్ కోసం ప్రతి ఇంజనీర్, టెక్నీషియన్, టెక్ అసిస్టెంట్ ఒక దగ్గరకు చేరి కలసి కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com