WHO ఫౌండేషన్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి
- December 08, 2020
జెనీవా: భారత సంతతికి చెందిన అనిల్ సోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఫౌండేషన్ సీఈవోగా నియామకమయ్యారు. వచ్చే జనవరి 1 న డబ్ల్యూహెచ్‌ఓ ఫౌండేషన్ ప్రారంభ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సోని తన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతకు ముందు గ్లోబర్ హెల్త్ కేటర్ కంపెనీ వట్రియాస్‌లో గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగానికి హెడ్‌గా కొనసాగారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వైద్యారోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు లాభాపేక్ష లేని రంగాల్లో 20 ఏళ్ల పాటు సేవలందించారు. ఈ సందర్భంగా అనిల్ సోనికి డబ్ల్యూహెచ్‌ఓ ఛీప్ టెడ్రోస్, WHO ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఫ్రొఫెసర్ థామస్ జెల్ట్నర్ అభినందించారు.
కాగా, 2023లోగా బిలియన్ డాలర్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకుని ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు WHO ఫౌండేషన్ పేర్కొంది. ఆ ఫౌండేషన్‌ను ఈ ఏడాది మేలో జెనీవాలో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సమాజంతో కలిసి అత్యంత ఒత్తిడితో కూడిన ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రారంభించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







