రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్‌షా సమావేశం
- December 08, 2020
న్యూ ఢిల్లీ:భారత్ బంద్‌తో కేంద్రం స్పందించింది. రైతులను చర్చలకు పిలిచింది.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్‌షా సమావేశం అయ్యారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న చర్చలు జరగాల్సి ఉన్నా.. రైతుల ఆందోళన మరింత ఉధృతం కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 13రోజులుగా రైతులు వివిధ రూపాల్లో ఆందోళన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త బంద్ చేపట్టారు.. రైతులకు మద్దతుగా బీజేపీయేతర పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి.. మరోవైపు ఇప్పటి వరకు ఐదుసార్లు రైతులతో కేంద్రం చర్చలు జరిపినా పురోగతి కనిపించలేదు. చర్చలు జరిపిన ప్రతిసారీ ప్రతిష్టంభనే తప్ప అడుగు కూడా ముందుకు పడలేదు.. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







