ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లు..
- December 10, 2020
రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి వైరస్ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సీజన్లో రుచికరమైన పండ్లు విరివిగా లభ్యమవుతాయి. వీటిని పచ్చిగా తినొచ్చు, స్మూతీలో కలపవచ్చు, పచ్చడి చేసుకుని మరింత రుచికరంగా మార్చుకోవచ్చు.
నారింజ
విటమిన్ సి, కాల్షియం నారింజలో అధికంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు కాలానుగుణ అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించగలవు. తాజాగా ఉండే నారింజ పండ్ల రసం రోజూ ఓ గ్లాస్ తీసుకుంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. యాపిల్స్ రోజుకో యాపిల్ తినడం మంచి ఆలోచన.
యాపిల్స్
శరీరంలో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి, కె సమృద్ధిగా ఉన్న యాపిల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తాయని పోషకాహార నిపుణులు భావిస్తారు.
జామకాయ
తీపిగా, రుచికరంగా ఉండే గువా (జామకాయ) ఈ సీజన్‌లో అత్యధికంగా దొరుకుతాయి.. అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు