తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు..
- December 10, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ కేసులు ఓరోజు ఎక్కువగా.. మరోరోజు తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి.. గత బులెటిన్‌లో 700కు పైగా పాజిటివ్ కేసులు నమదు కాగా.. తాజా బులెటిన్‌లో ఆ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 805 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,482కి పెరిగింది.. 2,66,925 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ఇక, నిన్న రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష