గూగుల్‌లో కలకలం..కలగజేసుకున్న సుందర్ పిచాయ్

- December 10, 2020 , by Maagulf
గూగుల్‌లో కలకలం..కలగజేసుకున్న సుందర్ పిచాయ్

గత వారం గూగుల్‌లోని ఓ కీలక ఉద్యోగి అనూహ్య నిష్క్రమణతో సంస్థలో కలకలం రేగింది. ఈ పరిమాణం కారణంగా ఉద్యోగుల్లో పలు అనుమానాలు తలెత్తడంతో సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారట. సదరు అధికారి మరింత గౌరవనీయమైన పరిస్థితుల్లో సంస్థను వీడి ఉంటే బాగుండేదని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్ నల్లజాతీ మహిళ టిమ్‌నిట్ గెబ్రూ గత వారం అనూహ్యంగా గుగుల్ ఉద్యోగాన్ని కోల్పోయారు. తనను గూగుల్ తొలగించిందని ఆమె ఆరోపిస్తే..గెబ్రూయే స్వయంగా రాజీనామా చేశారని గూగుల్ ప్రకటించింది. గూగుల్‌లో ఉద్యోగిగా ఉన్న సమయంలోనే గెబ్రూ ప్రచురించిన ఓ రిసెర్చ్ పేపర్‌ ఈ వివాదానికి నాంది పలికింది. గూగుల్ వినియోగిస్తున్న కృతిమ మేథ ఆధారిత టెక్నాలజీల కారణంగా సమాజానికి నష్టం జరిగే అవకాశం ఉందని గెబ్రూ తన పేపర్‌లో పేర్కొన్నారు. ఆ తరువాత..ఆమె గూగుల్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించారు.

అయితే.. వేల మంది గూగుల్ ఉద్యోగులు గెబ్రూకు మద్దతుగా నిలిచారు. మీ వెంట మేమున్నాంటూ వారు గెబ్రూకు ఓ బహిరంగ లేఖ రాశారు. అంతేకాకుండా.. గూగుల్‌ ఉద్యోగుల పరిశోధనలపై విధిస్తున్న ఆంక్షలు, జాతివివక్ష, సంస్థలోని రక్షణాత్మక ధోరణులను కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు స్వయంగా ఓ మెమో పంపించారు. 'నల్లజాతికి చెందిన ఓ కీలక మహిళా ఉద్యోగి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సంస్థ నుంచి నిష్క్రమించారు. ఈ సమయంలో మనం మరింత బాధ్యతతో వ్యవహరించాలి' అని ఆయన తన మెమోలో వ్యాఖ్యానించారు. గెబ్రు నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులను సమీక్ష ప్రారంభమైందన్న ఆయన..ఇదంతా మరింత గౌరవప్రద పరిస్థితుల్లో జరిగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

అయితే..గెబ్రూ తొలగింపు లేదా రాజీనామా అంశాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదని సమాచారం. దీంతో గెబ్రూ ఈ మెమో విషయంలో ఘాటుగానే స్పందించారు. సీఈఓ ఇచ్చిన వివరణలో తనకు క్షమాపణలు చెప్పలేదని, సంస్థలో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com