కువైట్:కోవిడ్ వ్యాక్సిన్ కోసం అధికారిక వెబ్ సైట్ల ద్వారా ప్రి రిజిస్ట్రేషన్లు
- December 11, 2020
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం అవసరమైన చర్యలను ప్రారంభించింది కువైట్ ప్రభుత్వం. వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు ముందస్తుగా ఆరోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ల(https://www.moh.gov.kw/) ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఫైజర్ తో అస్టిజింకాతో ఒప్పందం కుదుర్చుకున్న కువైట్ మరో 9 వ్యాక్సిన్లపై కూడా దృష్టి సారించింది. అయితే..వ్యాక్సిన్ కు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల అనుమతి రావాల్సి ఉందని, ఈ నెలాఖరు నాటికి అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అనుమతులు రాగానే....దేశంలో యుద్ధప్రాతిపదికన తక్కువ సమయంలో ఎక్కువమందికి వ్యాక్సిన్ అందేలా అవసరమైన చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు వివరించింది. వ్యాక్సినేషన్ కు వీలుగా ఫెయిర్ గ్రౌండ్ లోని ఓ అది పెద్ద హాలు సిద్ధం చేశామని, రోజుకు దాదాపు 10 వేల మందికి వ్యాక్సిన్ వేసేలా సౌకర్యాలు చేశామని తెలిపారు. అలాగే జహ్ర, అహ్మదీలోనూ వ్యాక్సిన్ కేంద్రాలను ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి మొబైల్ కు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పంపిస్తామని...దాంతో అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇక నుంచి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోమని మంత్రిత్వ శాఖ వివరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు