అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొనున్న ప్రధాని
- December 11, 2020
చెన్నై: ప్రధాని నరేంద్రమోడి తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 138వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. చెన్నైలోని వాసవిల్ సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాలు ఇవాళ జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవలందించినవారికి ప్రధాని మోదీ భారతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మహాకవి భారతి ఆశయాలను నెరవేర్చేలా ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి ప్రతి ఏడాది భారతి వార్డును అందిస్తారు. 1994 నుంచి వాసవిల్ సాంస్కృతిక కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తున్నది. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీ కవులు, కళాకారులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..