ఉద్యోగుల రిమోట్‌ వర్కింగ్‌ ప్రోటోకాల్స్‌కి షేక్‌ హమదాన్‌ ఆమోదం

- December 11, 2020 , by Maagulf
ఉద్యోగుల రిమోట్‌ వర్కింగ్‌ ప్రోటోకాల్స్‌కి షేక్‌ హమదాన్‌ ఆమోదం

దుబాయ్:తమ కార్యాలయాల వెలుపల దుబాయ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా ప్రొటోకాల్స్‌ని రూపొందించారు. వీటినికి దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌, దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఆమోదం తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యం ఈ రిమోట్‌ వర్కింగ్‌ విధానం ద్వారా మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. కరోనా నేపథ్యంలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా వుంటుందనీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సులువుగా ఉపయోగించడానికి వీలవుతుందని షేక్‌ హమదాన్‌ అభిప్రాయపడ్డారు. ఆఫ్‌ సైట్‌లో పని చేయడం వల్ల ఎవరి పని మీద అయితే ప్రత్యేకంగా ప్రభావం చూపదో, అలాంటివారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఒకవేళ విదేశాల్లో వివిధ కారణాలతో ఆయా ఉద్యోగులు చిక్కుకుపోయినా, అక్కడి నుంచి కూడా వారు విధులు నిర్వర్తించే అవకాశం ఇస్తుండడం గమనార్హం. దుబాయ్‌ గవర్నమెంట్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ అబ్దుల్లా అలి బిన్‌ జాయెద్‌ అల్‌ ఫలాసి మాట్లాడుతూ, ఆయా ఉద్యోగుల సామర్థ్యాన్ని మరింత పెంచేలా, వారి ఔట్‌ పుట్‌ ఇంకా పెరిగేలా ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆపరేషనల్‌ కాస్ట్‌ తగ్గడం, ట్రాఫిక్‌ సమస్యలు తగ్గడం, ప్రోడక్టివిటీ పెరగడం వంటి లాభాలు ఇందులో వున్నాయన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com