జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ

- December 15, 2020 , by Maagulf
జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన ఏపీ పోలీస్ శాఖ

అమరావతి:ఏపీ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తాచాటింది.ICJS (Inter operable criminal justice system)అమలు, వినియోగంలో ఏపీ పోలీస్ శాఖ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్‌లైన్ ద్వారా డీజీపీ గౌతమ్ సవాంగ్ అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏపీ దక్కించుకోవడం పట్ల సీఎం జగన్, హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మొదటి స్థానం మహారాష్ట్ర దక్కించుకోగా.. ఏపీ రెండవ స్థానంలో, తెలంగాణ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com