ఉచిత కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించిన సౌదీ

- December 15, 2020 , by Maagulf
ఉచిత కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభించిన సౌదీ

రియాద్‌: సౌదీ అరేబియా, కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ నిమిత్తం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు హెల్త్‌ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. http://onelink.to/yjc3nj లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయించుకోవాల్సి వుంటుంది. కాగా, వ్యాక్సిన్‌ అన్ని పరీక్షల్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడు దశల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. తొలి స్టేజ్‌లో 65 ఏళ్ళు పైబడినవారికి, బీఎంఐ 40 పైబడినవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారికి, వైరస్‌ ఇన్ఫెక్షన్‌కి గురయ్యేవారికి.. ఇలా పలు రకాల వారికి తొలి దశలో వ్యాక్సిన్‌ ఇస్తారు. రెండో దశలో 50 ఏళ్ళ పైబడినవారికి, హెల్త్‌ ప్రాక్టీషనర్స్‌కీ, 30 నుంచి 40 మధ్య బీఎంఐ వున్నవారికీ వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుంది. మూడో దశలో అందరికీ వ్యాక్సిన్‌ని ఇస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com